Hyundai Car Offers | దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది. సెలెక్టెడ్ కార్లపై ఈ నెలాఖరు వరకూ రూ.43 వేల వరకూ డిస్కౌంట్లు ప్రకటించింది. ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్ బ్యాక్, సబ్ కంపాక్ట్ సెడాన్ ఔరా, సబ్ కంపాక్ట్ ఎస్యూవీ వెన్యూలపై డిస్కౌంట్ వర్తిస్తుంది. క్రెటా ఫేస్ లిఫ్ట్, ఎక్స్ టర్, టస్కన్, ఆల్కాజర్ వంటి ఫ్లాగ్ షిప్ ఎస్యూవీలు, సెడాన్ వెర్నా, ఐకానిక్ 5 ఈవీ కార్లపై ఎటువంటి రాయితీలు ఇవ్వడం లేదు.
హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ కారుపై అత్యధికంగా రూ.43 వేల డిస్కౌంట్ ప్రకటించింది. వాటిలో క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 ఉన్నాయి.
సబ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కారు ఔరాపై రూ.33 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. వాటిలో క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది.
సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కారు వెన్యూపై గరిష్టంగా రూ.30 వేల డిస్కౌంట్ అందిస్తోంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.10 వేల వరకూ లభిస్తుంది.
హ్యుండాయ్ హ్యాచ్ బ్యాక్ ఐ20 కారుపై రూ.25 వేల వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వాటిలో రూ.15 వేలు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ రూ.10 వేలు ఉన్నాయి.