Hyundai | ఈవీ కార్ల యూనిట్.. చార్జింగ్ ఇన్ఫ్రా ఫెసిలిటీ.. తమిళనాడు సర్కార్‌తో హ్యుండాయ్ ఎంవోయూ..
Hyundai | తమిళనాడులో మరో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెడతామని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’లో ఎంఓయూపై సంతకాలు చేసింది.
Hyundai | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తమిళనాడులో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. తమిళనాడులో హైడ్రోజన్ రీసోర్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 2023-32 మధ్య పదేండ్ల కాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చేసిన ప్రకటనకు ఇది అదనం. ఎలక్ట్రికల్ వెహికల్స్ కార్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్, చార్జింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.6,180 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఇందుకోసం సోమవారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ -2024’లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎంఓయూ కుదుర్చుకున్నది.
రాష్ట్రంలో సామాజిక- ఆర్థికాభివృద్ధి, భారత్ స్వావలంభనకు తమ పెట్టుబడులు ఖర్చు చేస్తామని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్ సూ కిమ్ ఓ ప్రకటనలో తెలిపారు. మద్రాస్ ఐఐటీతోపాటు కలిసి రూ.180 కోట్లతో హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ హబ్ నిర్మిస్తామని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఇందుకోస్ ఐఐటీ మద్రాస్‌తో ఎంఓయూపై హ్యుండాయ్ మోటార్స్ ఇండియా సంతకాలు చేసింది. హైడ్రోజన్ ఎకో సిస్టమ్ లోకలైజేషన్ కోసం ఇంకుబేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

