హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్- ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది.
2022కి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల వార్షిక ప్రయాణీకుల విభాగంలో ఈ అవార్డు లభించింది. వరుసగా 9 సంవత్సరాలు హైదరాబాద్ విమానాశ్రయం గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తున్నది.