హైదరాబాద్, ఫిబ్రవరి 25 : బయోలాజికల్ లిమిటెడ్(బీఈ).. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో చికెన్‌గున్యా వ్యాక్సిన్‌ను అందించడానికి బవేరియన్ నార్డిక్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి హైదరాబాద్‌లోని ఉన్న ప్లాంట్‌ను విస్తరించ నున్నట్లు బీఈ ఎండీ మహిమా దాట్లా తెలిపారు. దీంతో 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.