హైదరాబాద్, డిసెంబర్ 11: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఐస్ప్రౌట్ రూ.60 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను టాటా క్యాపిటల్ నుంచి సేకరించినట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో సుందరి పాటిబండ్ల తెలిపారు.
ఈ నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం, కీలక మెట్రోలు, ఎంటర్ప్రైజెస్-గ్రేడ్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి వినియోగించనున్నట్టు ఆయన చెప్పారు.