హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ఆవిషరణలకు ఊతమిచ్చేలా, ఆవిషర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. కృత్రిమ మేధ(ఏఐ) ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్నింటికీ విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని చెప్పారు.
కృత్రిమమేధ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాదన్న ఆయన..కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా.. రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగం చేరినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో క్యాన్సర్, గుండెజబ్బులు వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిషారాలు, ఆవిషరణలు రావాల్సిన అవసరమున్నదని మంత్రి సూచించారు. ఇందుకు హైదరాబాద్‌ను ఒక ల్యాంచ్ ప్యాడ్‌గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదురొనేలా… కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్రం ముందుకెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఆవిషరణలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేలా ఆవిషర్తలు, స్టార్టప్స్‌కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డాటా ఎక్సేంజ్‌ను ప్రారంభించినట్టు వెల్లడించారు.