Xiaomi Discounts | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘షియోమీ (Xiaomi) ’ తన నాలుగు ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. ప్రత్యేకించి షియోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) ఫోన్లపై భారీగా రూ.20 వేల వరకు ధర తగ్గించేసింది. ఇంకా రెడ్ మీ కే 50ఐ (Redmi K50i) , రెడ్ మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G), రెడ్ మీ 12 సీ (Redmi 12C) ఫోన్లు డిస్కౌంట్లపై సొంతం చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్లు పొందాలంటే ఎంఐ వెబ్ సైట్, అమెజాన్ ఇండియా ఆన్ లైన్ స్టోర్కెళ్లాల్సిందే.
షియోమీ ఫ్లాగ్ షిప్ ఫోన్ షియోమీ 12 ప్రో మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు దాని ధర రూ.62,999. వివిధ బ్యాంకులపై క్యాష్ బ్యాక్, ఇతర ఆఫర్ల ద్వారా రూ.42,999లకే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.73 అంగుళాల 2కే + అమోలెడ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, ఎంఐయూఐ 13, 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 120 వాట్ల చార్జింగ్, 50-మెగా పిక్సెల్స్, 50-మెగా పిక్సెల్, 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతోపాటు సెల్ఫీల కోసం 32 ఎంపీ సెన్సర్ కెమెరా లభిస్తుంది. 120 వాట్ల హైపర్ చార్జి సాయంతో 18 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చు.
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ.. తన రెడ్ మీ 12 సీ ఫోన్ బ్యాంకు డిస్కౌంట్లతో రూ.8,499లకే అందుబాటులోకి రాను్నది. 6.71 అంగుళాల హెచ్డీ + స్క్రీన్, మీడియా టెక్ హెలియో జీ 85 ప్రాసెసర్, ఎంఐయూఐ 13, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 10 వాట్ల చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా సెన్సర్ తో కూడిన కెమెరా సెటప్, నాలుగు రంగులు – లావెండర్ పర్పుల్, మింట్ గ్రీన్, రాయల్ బ్లూ, మ్యాట్టె బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు రెడ్ మీ 12సీ ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,499లకు విక్రయించింది.
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ మరో ఫోన్ రెడ్ మీ కే50ఐ ఫోన్ మీద రూ.7,000 వరకు రాయితీ అందుబాటులో ఉంది. మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు ఈ ఫోన్ ధర రూ.25,999. వివిధ బ్యాంకుల ఇన్ స్టంట్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ క్యాష్ బ్యాక్ ఆఫర్లతో రూ.18,999లకే సొంతం చేసుకోవచ్చు. 6.6-అంగుళాల 144 హెర్ట్జ్ స్క్రీన్, మీడియా టెక్ డైమెన్సిటీ 8100 ఎస్వోసీ చిప్ సెట్, ఎంఐయూఐ 13, 5080 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల చార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. 64 -మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరా లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది.
షియోమీ అనుబంధ రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ మీద రూ.7000 డిస్కౌంట్ ప్రకటించింది. మార్కెట్లో ఆవిష్కరణ వేళ రూ.21,999 ధర ప్రకటించారు. ఇప్పుడు వివిధ ఆఫర్ల ద్వారా రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు. 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ 120 హెర్ట్జ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్, ఎంఐ యూఐ 13 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల చార్జింగ్, 48 మెగా పిక్సెల్స్ + 8 ఎంపీ + 2 ఎంపీ రేర్ కెమెరా సెటప్ ప్లస్ 13 మెగా పిక్సెల్స్ సెల్ఫీ సెన్సర్ ఉంటుంది.