Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. సోమవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పరిగాయి. 24 క్యారెట్ల పసిడి రూ.1,300 పెరిగి తులానికి రూ.1,25,900 కి చేరుకుంది. వెండి సైతం రూ.2,460 పెరిగి కిలో ధర రూ.1,55,760కి చేరుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం, డాలర్ విలువ పడిపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దాంతో డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమావేశంలో వడ్డీ రేటు తగ్గుతుందనే అంచనాలు కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ నిపుణుడు సౌమిల్ గాంధీ తెలిపారు.
వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. శుక్రవారం కిలోకు రూ.1,53,300 నుంచి ప్రస్తుతం రూ.1,55,760కి చేరాయి. ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. స్పాట్ బంగారం ఔన్సుకు దాదాపు 2.08శాతం పెరిగి 4,082.84 డాలర్లకు చేరుకోగా.. వెండి 3.30శాతం పెరిగి ఔన్సుకు 49.93 డాలర్లకు పెరిగింది. ఎల్కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన జతిన్ త్రివేది ప్రకారం.. అమెరికా ప్రభుత్వం తిరిగి ప్రారంభమయ్యే సంకేతాలు, బలహీనమైన డాలర్ కారణంగా బులియన్ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ బలపడింది.