Tata Motors | టాటా కార్లపై భారీ డిస్కౌంట్..రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ
టాటా మోటర్స్ కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీగా రాయితీలు ప్రకటించగా..ఇదే జాబితాలోకి టాటా మోటర్స్ కూడా చేరింది. కంపెనీకి చెందిన అన్ని రకాల మాడళ్లపై రూ.3 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. దీంట్లో ఎక్సేంజ్ బోనస్, డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, నగదు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
- రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ
న్యూఢిల్లీ, మే 9: టాటా మోటర్స్ కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీగా రాయితీలు ప్రకటించగా..ఇదే జాబితాలోకి టాటా మోటర్స్ కూడా చేరింది. కంపెనీకి చెందిన అన్ని రకాల మాడళ్లపై రూ.3 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. దీంట్లో ఎక్సేంజ్ బోనస్, డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, నగదు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.
నెక్సాన్ నయా మాడల్
ప్రముఖ వాహన సంస్థ టాటా మార్కెట్లోకి నెక్సాన్ ప్యూర్+ పీఎస్ మాడల్‌ను తీసుకొచ్చింది. పానోరమిక్ సన్‌రూఫ్‌తో తీర్చిదిద్దిన ఈ కారు ప్రారంభ ధర రూ.9.59 లక్షలుగా నిర్ణయించింది. దీంతో పెట్రోల్ రకం రూ.9.59 లక్షల నుంచి రూ.10.14 లక్షల లోపు లభించనుండగా, సీఎన్జీ మాడల్ రూ.10.39 లక్షలుగాను, డీజిల్ రకం రూ.10.54 లక్షల నుంచి రూ.11.19 లక్షల లోపు లభించనున్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
1.2 లీటర్ టర్బోచార్జ్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్ పెట్రోల్, ట్విన్ సిలిండర్ ఐసీఎన్జీ రకంతోపాటు డీజిల్ ఇంజిన్‌తో కూడా తీర్చిదిద్దింది. వాయిస్‌తో పానోరమిక్ సన్‌రూఫ్‌ను కంట్రోల్ చేసే టెక్నాలజీతో తయారైన ఈ కారులో 26 సెంటిమీటర్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆరు స్పీకర్లు, హెచ్డీ రియర్ కెమెరా, ఆటో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

