న్యూఢిల్లీ, జూలై 4: ఈవీల అమ్మకాలను పెంచడానికి టాటా మోటర్స్ మరోసారి భారీ రాయితీలను ప్రకటించింది. జూలై నెలకుగాను రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు వెల్లడించింది. వీటిలో అత్యధికంగా కర్వ్య్.ఈవీ మాడల్పై రూ.3.35 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న సంస్థ..హారియర్ ఈవీపై రూ.2.75 లక్షలు, పంచ్ ఈవీ, టియాగో ఈవీపై రూ.1.45 లక్షలు, నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది.
ఈ రాయితీల్లో గ్రీన్ బోనస్తోపాటు ఎక్సేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాల కింద ఆర్థిక లబ్దిచేకూరుస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా, హ్యుందాయ్, మారుతి, ఎంజీ, విన్ఫాస్ట్, టెస్లా కార్లకు ఇటీవల కాలంలో డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు, దేశవ్యాప్తంగా టాటా మోటర్స్ ఈవీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. ఏప్రిల్ నెలలో 23,500 యూనిట్ల విక్రయాలు జరిపిన సంస్థ..మే నెలలో 26,700, జూన్లో 31,253 యూనిట్లను విక్రయించింది. డిమాండ్ పెరుగుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా రెండింతలు పెంచుకున్నది.