న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. జీఎస్టీ తగ్గించడంతో రెండు నెలల క్రితం వాహన ధరలను భారీగా తగ్గించిన సంస్థ..ఈసారి ఏకంగా పలు మాడళ్లపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ను కల్పించింది. వీటిలో టియాగో, హారియర్, సఫారీ, పంచ్, కర్వ్య్, అల్ట్రోజ్, టిగోర్ మాడళ్లు ఉన్నాయి.
ఎంపిక చేసిన మాడళ్లపై కన్జ్యూమర్ డిస్కౌంట్, ఎక్సేంజ్, లాయల్టీ ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. వీటిలో ఎలక్ట్రిక్ వాహనం టియాగోపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ను కల్పిస్తున్నది. దీంతోపాటు పంచ్ ఈవీపై లక్ష రూపాయలు, కర్వీ ఈవీపై రూ.1.30 లక్షలు, టియాగోపై రూ.50 వేలు, టిగోర్పై రూ.30 వేలు, అల్ట్రోజ్ పెట్రోల్, సీఎన్జీ, డీజిల్ మాడళ్లపై రూ.65 వేలు, నెక్సాన్ పెట్రోల్, సీఎన్జీ, డీజిల్ మాడళ్లపై రూ.45 వేలు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.