Gold | బంగారం అంటే ఇష్టమని ఎంత పడితే అంత కొంటున్నారా? ఇంతకంటే ఎక్కువ ఇంట్లో ఉంటే ఐటీ అధికారులు పట్టుకెళ్తారు జాగ్రత్త!
Gold | మనలో చాలామందికి వీలున్నప్పుడల్లా బంగారు నగలను కొని ఇంట్లో పెట్టుకోవడం అలవాటు. శుభకార్యాల్లో ధరించేందుకు.. అవసరం ఉన్నప్పుడు ఇట్టే నగదుగా మార్చుకునేందుకూ అనువుగా ఉండటం పుత్తడికున్న సౌకర్యం. అయితే చేతిలో పైసలున్నాయని ఎంతంటే అంత కొని గోల్డ్‌ను ఇంట్లో ఉంచుకోలేమని మీకు తెలుసా.
Gold | మనలో చాలామందికి వీలున్నప్పుడల్లా బంగారు నగలను కొని ఇంట్లో పెట్టుకోవడం అలవాటు. శుభకార్యాల్లో ధరించేందుకు.. అవసరం ఉన్నప్పుడు ఇట్టే నగదుగా మార్చుకునేందుకూ అనువుగా ఉండటం పుత్తడికున్న సౌకర్యం. అయితే చేతిలో పైసలున్నాయని ఎంతంటే అంత కొని గోల్డ్‌ను ఇంట్లో ఉంచుకోలేమని మీకు తెలుసా. అదేంటి మన సొమ్ముతో మనకు నచ్చిన నగల్ని మనింటికి తెచ్చుకోవడానికీ పరిమితులున్నాయా.. అని అనుకుంటున్నారా?. ఉన్నాయి.. ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు అన్నదాని కోసం పలు రకాల పన్ను నిబంధనలున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పరిమాణాలను పేర్కొంటూ చట్టాలను చేసింది. వాటి ప్రకారం ఇంట్లో బంగారం లేదా బంగారు ఆభరణాలను ఒక స్థాయి వరకే ఉంచుకోవాలి. అది దాటితే అనవసరపు ఇబ్బందులు తప్పవు. మరి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి మరి.
బంగారం.. ఎప్పటికీ విలువైనదే. అందుకే ప్రతి ఒక్కరూ దాన్ని వీలైనంత ఎక్కువగా సొంతం చేసుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. నగలు, నాణేలు, బిస్కట్ల రూపంలో భద్రపర్చుకుంటారు. అయితే ఇప్పుడు డిజిటల్ గోల్డ్ ట్రెండ్ నడుస్తున్నది. గోల్డ్ బాండ్లూ బాగానే ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఈ లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే నడుస్తాయి కాబట్టి గొడవే లేదు. అయితే దేశంలో ఇంకా చాలామంది భౌతిక బంగారాన్నే ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటున్నారు. కానీ పురుషులు, స్త్రీలు ఎవరైనాసరే భౌతికంగా బంగారం ఏ రూపంలో ఉన్నా ఇంతే తమవద్ద పెట్టుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చెప్తున్నది.
సీబీడీటీ ఏం చెప్తున్నది?
దేశంలో ఎవరెంత బంగారాన్ని తమవద్ద ఉంచుకోవచ్చన్న దానిపై సీబీడీటీ కొన్ని నిబంధనల్ని పెట్టింది. వీటి ప్రకారం సదరు పరిమితి దాటితే ఆ మొత్తం బంగారానికి సంబంధించిన లెక్కల్ని ఐటీ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. అలాగే సోదాలు, తనిఖీల సమయంలో నిబంధనల మేరకు ఉన్న బంగారం లేదా బంగారు ఆభరణాలను అధికారులెవరూ జప్తుగానీ, స్వాధీనంగానీ చేసుకోవద్దని కూడా సీబీడీటీ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక దొరికిన బంగారం ఎంత ఉన్నా.. దానికి చట్టబద్ధత ఉంటే (పన్నులు చెల్లించి కొన్న రుజువులు ఉంటే) కూడా వాటికి జోలికి పోరాదు.
ఎవరి దగ్గర ఎంతెంత? అంటే..
☞ పైండ్లెన మహిళలు తమవద్ద అరకిలో వరకు (50 తులాలు) బంగారాన్ని పెట్టుకోవచ్చు
☞ పెండ్లికాని స్త్రీలు పావుకిలో వరకు (25 తులాలు) గోల్డ్‌ను ఉంచుకోవచ్చు
☞ మగవారు తమ దగ్గర 100 గ్రాముల వరకు (10 తులాలు) పుత్తడిని దాచుకోవచ్చు
నిపుణులు ఏమంటున్నారు?
బంగారం లేదా బంగారు ఆభరణాలను కొంటున్నప్పుడు దానికి సంబంధించిన బిల్లును అంతా తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దాన్ని భద్రంగా దాచుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే బంగారు నగలను ఎవరైనా ఎంతైనా తమవద్ద ఉంచుకోవచ్చని సీబీడీటీ కూడా చెప్తున్నట్టు వారు గుర్తుచేస్తున్నారు. కానీ ఇందుకు బిల్లులు కచ్చితంగా ఉండాలంటున్నట్టు వివరిస్తున్నారు. కనుక బంగారం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర కొన్నా దాని బిల్లులు ఉంటే నిశ్చింతగా ఉండవచ్చు. ధర తగ్గతుందని బిల్లును వద్దనుకుంటే కొన్న బంగారం ఎప్పటికైనా మీకు చిక్కుల్ని తెచ్చిపెట్టకపోదని హెచ్చరిస్తున్నారు.
పన్ను నిబంధనలు ఏమిటి?
☞ మీరు ప్రకటించిన ఆదాయం నుంచి గానీ లేదా వ్యవసాయం ద్వారా ఆర్జించిన సంపాదనతోగానీ మీ బంగారం కొన్నైట్టెతే దానికి పన్నులు వర్తించవు. అలాగే మీ ఇంటి ఖర్చులను తగ్గించి మిగుల్చుకున్న నగదుతో బంగారు ఆభరణాలను కొన్నా.. లేక వారసత్వంగా మీకు సదరు బంగారం సంక్రమించినా దానిపైనా పన్నులుండవు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలన్నీ పక్కాగా మీవద్ద ఉండాలి. లెక్కల్లో తేడా ఉంటే పన్ను పోటు తప్పదు.
☞ ఇక మీ బంగారాన్ని అమ్ముకున్నప్పుడు పన్ను పడుతుంది. ఒకవేళ మూడేండ్లు బంగారాన్ని మీవద్దే ఉంచుకుని, ఆ తర్వాత అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. బంగారం అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.
☞ ఒకవేళ బంగారం కొన్న మూడేండ్లలోపే దాన్ని అమ్మేస్తే.. అలా వచ్చిన ఆదాయం మీ మొత్తం వార్షికాదాయంలో జమవుతుంది. అప్పుడు మీరు పన్ను చెల్లింపుదారుడి కిందకే వస్తారు. దీంతో సంబంధిత పన్ను శ్లాబుల ప్రకారం ఐటీ శాఖకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
Read More :
Gold | భారీగా తగ్గిన గోల్డ్ అమ్మకాలు.. బంగారంపై జనాలకు ఇంట్రెస్ట్ పోయిందా ఏంటి?”
Income Tax | బంగారం విక్రయించినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే!”
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- gold
- Gold Price
- gold rates
- it rules
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

