Income Tax | బంగారం విక్రయించినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే!
Income Tax |మీరు కొనుగోలు చేసిన బంగారం, బంగారం ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లను విక్రయించినా.. అలా వచ్చిన లాభాలపై ఐటీ చెల్లించాల్సిందే.
Income Tax | గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఈ నెల 31వ తేదీ తుది గడువు. ప్రతి వేతన జీవి, చిన్న వ్యాపారి, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ వరకు.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రతి ఒక్కరూ తమకు వచ్చే అన్ని రకాల ఆదాయం, పెట్టుబడి లాభాల వివరాలపై సరైన సమాచారం ఇవ్వాల్సిందే. ఒకవేళ, మీరు బంగారం విక్రయించినా, దానిపై వచ్చే లాభం మీద ఐటీ చెల్లించాల్సిందే. ఒకవేళ మీరు బంగారం విక్రయం మీద వచ్చిన లాభంపై పన్ను చెల్లించ లేదనుకోండి.. పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయం పన్ను విభాగం నిర్ణయిస్తుంది. ఈ పరిస్థితుల్లో మీకు ఆదాయం పన్ను విభాగం నోటీసులు జారీ చేస్తుంది.
ఆభరణాలు, బంగారం నాణాలు, ఇతర గోల్డ్ ఐటమ్స్ కూడా ఫిజికల్ గోల్డ్‌లో భాగమే. మీరు బంగారం కొన్న మూడేండ్ల లోపు విక్రయిస్తే, దాన్ని స్వల్పకాలిక పెట్టుబడి లాభంగా పరిగణిస్తారని చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అభయ్ శర్మ చెప్పారు. మీకు వచ్చే ఆదాయం, దానిపై ఐటీ శ్లాబ్ ను బట్టి బంగారం విక్రయంపై వచ్చే లాభం మీద పన్ను విధిస్తారు. బంగారం కొన్న మూడేండ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక పెట్టుబడి లాభంగా పరిగణిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై 20.8 శాతం ఐటీ చెల్లించాల్సి ఉంటుంది.
గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసిన మూడేండ్ల లోపు విక్రయిస్తే స్వల్పకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను పే చేయాల్సి ఉంటుంది. అదీ కూడా మీ ఇన్‌కం టాక్స్ శ్లాబ్‌ను బట్టి ఆధార పడి ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుచేసిన మూడేండ్ల తర్వాత విక్రయించినా దీర్ఘకాలిక లాభాలపై పన్ను పే చేయాలి.
ఉదాహరణకు సావరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ గడువు ఎనిమిదేండ్లు ఉంటుంది. ఒకవేళ అత్యవసర కారణాల రీత్యా మెచ్యూరిటీ తేదీకి ముందే విత్ డ్రా చేస్తే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వర్తిస్తుంది. గోల్డ్ బాండ్లపై 2.50 శాతం వడ్డీ లభిస్తుంది. మధ్యలో విత్ డ్రా చేసుకుంటే పన్ను పే చేయాల్సి ఉంటుంది. అలా కాక గడువు పూర్తయ్యే వరకు కొనసాగితే పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఉదాహరణకు మీరు కొన్నేండ్ల క్రితం రూ.లక్ష విలువ గల బంగారం లేదా ఆస్తి కొనుగోలు చేశారనుకుందాం.. ఇప్పుడు అది రూ.2 లక్షలైతే.. అదనపు రూ.లక్షను క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణిస్తారు. ఆ రూ.లక్ష మీదే ఆదాయం పన్ను విధిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

