Honda NX500 ADV | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. దేశీయ మార్కెట్లోకి ఎన్ఎక్స్500 అడ్వెంచర్ టూరర్ బైక్ ఆవిష్కరించింది. హోండా సీబీ500ఎక్స్ స్థానంలో న్యూ ఎన్ఎక్స్500 అడ్వెంచర్ బైక్ తీసుకొచ్చింది. సీబీ500ఎక్స్ మోటారు సైకిల్లో వినియోగించిన 471సీసీ, పార్లల్ ట్విన్ ఇంజిన్నే న్యూ ఎన్ఎక్స్500 మోటారు సైకిల్లో వినియోగించారు. ఈ ఇంజిన్ లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్ డీఓహెచ్సీ కన్‌స్ట్రక్షన్‌గా ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8600 ఆర్పీఎం వద్ద 46.5 బీహెచ్పీ విద్యుత్, 6500 ఆర్పీఎం వద్ద 43 టార్క్ వెలువరిస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తోంది. ఎన్ఎక్స్ 500 అడ్వెంచర్ బైక్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తున్నది. గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాట్టె గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్, పెరల్ హరిజోన్ వైట్ కలర్స్‌లో లభిస్తుందీ బైక్.
ఎన్ఎక్స్500 బైక్ 5-అంగుళాల టీఎఫ్టీ ఫుల్ కలర్ టీఎఫ్టీ స్క్రీన్, ఆండ్రాయిడ్, ఓఐఎస్‌తో కూడిన హోండా రోడ్ సింక్ యాప్ ఉంటుంది. మ్యూజిక్ లేదా వాయిస్ కంట్రోల్, టర్న్ బై టర్న్ నేవిగేషన్ పొందొచ్చు. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ పేరుతో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఆల్ ఎల్ఈడీ లైటింగ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్ కూడా ఉంటాయి.
సీబీయూ ద్వారా హోండా ఎన్ఎక్స్500 బైక్ రూ.5.90 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. హోండా బిగ్ వింగ్ డీలర్ షిప్‌ల వద్ద బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కవాసాకీ వెర్సీస్ 650, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్ మోటారు సైకిళ్లతో పోటీ పడుతుందీ బైక్. ఈ మోటారు సైకిల్ డెలివరీలు ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతాయి.