న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా తన వాహన ధరలను తగ్గించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా 350 సీసీ వరకు మాడళ్ల ధరలను రూ.18,800 కోత పెట్టింది.
350 సీసీ లోపు కలిగిన బైకులపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి ధరలు దిగొస్తున్నాయి.