Honda Unicorn |ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) అప్డేటెడ్ హోండా యూనికార్న్ (Honda Unicorn) బైక్.. మార్కెట్లో ఆవిష్కరించింది. ఓబీడీ2 నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న 2023 హోండా యూనికార్న్ లీటర్ పెట్రోల్‌పై 55 కి.మీ. మైలేజీ ఇస్తుంది. అంతే కాదు ప్రత్యేకంగా పదేండ్ల వారంటీ ప్యాకేజీ కూడా అందిస్తున్నది. ఇందులో మూడేండ్ల స్టాండర్డ్ వారంటీ, ఏడేండ్ల ఆప్షనల్ వారంటీ ఉంటుంది. సింగిల్ వేరియంట్లో మార్కెట్లోకి వచ్చిన హోండా యూనికార్న్ బైక్ ధర రూ.1,09,800 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. సెల్ఫ్ లేదా కిక్ స్టార్ట్ ఆప్షన్లలో లభిస్తుంది.
హోండా యూనికార్న్ (Honda Unicorn) బైక్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. పెరల్ సిరెన్ బ్లూ, పెరల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్టె యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కొత్తగా పెరల్ సిరెస్ బ్లూ ఆప్షన్ తెచ్చారు. 160సీసీ ఇంజిన్ సెగ్మెంట్లో మార్కెట్లోకి వచ్చి హోండా యూనికార్న్ (Honda Unicorn) .. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2వీ, బజాజ్ పల్సర్ 150, బజాజ్ పల్సర్ ఎన్150 మోటారు సైకిళ్లతో పోటీ పడుతుంది.
మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ, పీజీఎం-ఎఫ్ఐ ఫ్యూయల్ ఇంజెక్షన్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. సస్పెండెడ్ డైమండ్ టైప్ ఫ్రేమ్, ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, రేర్ మోనోసాక్ సస్పెన్షన్ ఫోర్క్ ఉంటుంది. 240ఎంఎం సింగిల్ చానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) డిస్క్ ఇన్ ఫ్రంట్, 130ఎంఎం డ్రమ్ ఎట్ రేర్ లభిస్తుంది. 18-అంగుళాల వీల్స్‌తో కూడిన ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.
2023 హోండా యూనికార్న్ 160 సీసీ బైక్ 162.7సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్ ఇంజిన్ 7500 ఆర్పీఎం వద్ద 12.7 బీహెచ్పీ విద్యుత్, 5500 ఆర్పీఎం వద్ద 14 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బ్యాక్స్ కూడా వస్తుంది. ఓబీడీ-2 నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ బైక్.. ఈ-20 పెట్రోల్ తోనూ నడుస్తుంది. సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ ఆప్షన్లలోనూ లభిస్తుంది.