Honda India | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా ఇండియా (Honda India) వివిధ మోడల్ కార్లు 90,468 యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరో 2,204 కార్లలో స్పేర్ పార్టులు మార్చాల్సి ఉందని పేర్కొంది. ఇందులో హోండా సిటీ, హోండా అమేజ్, హోండా బ్రియో, హోండా బీఆర్-వీ, హోండా డబ్ల్యూఆర్-వీ, హోండా జాజ్, హోండా అకార్డ్ ఉన్నాయి. 2017 సెప్టెంబర్ నుంచి 2018 జూన్ మధ్య తయారైన కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ కార్లలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపుల్లో డిఫెక్టివ్ ఇంపెల్లర్స్ ఉన్నాయని పేర్కొంది. దీనివల్ల ఇంజిన్ అర్ధంతరంగా ఆగిపోవడం లేదా ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం గానీ జరుగుతుందని తెలిపింది. డిఫెక్టెడ్ కార్లలో ఫ్యుయల్ పంప్ ఉచితంగా రీప్లేస్ చేస్తామని వెల్లడించింది. నవంబర్ ఐదో తేదీ నుంచి దశల వారీగా రీప్లేస్ చేస్తామని వివరించింది.
అమేజ్ – 2017 సెప్టెంబర్ 19 నుంచి 2018 జూన్ 30 – 18,851
బ్రియో – 2017 ఆగస్టు 8 నుంచి 2018 జూన్ 27 – 3,317
బీఆర్-వీ – 2017 సెప్టెంబర్ 26 నుంచి 2018 జూన్ 14 – 4,386
సిటీ – 2017 సెప్టెంబర్ 4 నుంచి 2018 నుంచి జూన్ 29 – 32,872
జాజ్ – 2017 సెప్టెంబర్ 4 నుంచి 2018 జూన్ 29 – 16,744
డబ్ల్యూఆర్-వీ – 2017 సెప్టెంబర్ 5 నుంచి 2018 జూన్ 30 – 14,298
అకార్డ్, అమేజ్, బ్రియో, బీఆర్-వీ, సిటీ, సివిక్, జాజ్, డబ్ల్యూఆర్-వీ – విడి భాగాల మార్పు -2,204