Home Loans EMIs Costly | ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ వెంటవెంటనే రెపోరేట్ పెంచేసింది. తదనుగుణంగా ఇండ్ల రుణాలపై నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) కూడా భారంగా మారింది. ఇది ప్రతి ఒక్కరిపై భారం మోపుతుంది. రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్‌తోపాటు ఆ వ్యక్తి తీసుకునే రుణం, లోన్ టెన్యూర్‌తో నిమిత్తం లేకుండా ఈఎంఐ భారంగా మారుతుంది.
గత మే నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు మూడు దఫాల్లో ఆర్బీఐ రెపోరేట్ 1.40 శాతం పెంచేసింది. దీంతో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు రెండు శాతం వరకు పెంచేశాయి. దీంతో ద్రవ్యోల్బణం మోస్తరుగా తగ్గుముఖం పట్టినా.. ప్రజలు సొమ్ము ఆదా చేసినా.. చేయకున్నా.. ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి ఆ భారం తప్పనిసరిగా పెరుగుతుంది.
ఫిక్స్డ్ వడ్డీరేటుపై ఇండ్ల రుణాలు తీసుకునే వారి పాకెట్లపై ప్రభావం ఉండదు. కానీ, ఇప్పుడు వివిధ బ్యాంకుల నుంచి తీసుకునే కొత్త రుణాలపై రెండు శాతం వరకు కాస్ట్లీగా మారతాయి. మే నెలకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, సిటీ బ్యాంక్ ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 6.5-6.9 శాతం మధ్య ఉండేవి. కానీ ఇప్పుడు అదే బ్యాంకుల ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 7.45 నుంచి 8.85 శాతం మధ్య పెరిగాయి.
ఇక ఫ్లోటింగ్ వడ్డీరేటుపై ఇండ్ల రుణాలు తీసుకున్న వారి నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ)లు పెరుగుతాయి. ఒకరు ఎస్బీఐలో 20 ఏండ్లకు రూ.50 లక్షల ఇండ్ల రుణం తీసుకుందాం అనుకుందాం. వడ్డీరేట్లు పెంచకముందు ఈఎంఐ రూ.38,018గా ఉండేది. కానీ ఇప్పుడు వడ్డీరేటు పెంచాక రూ.2415 పెరిగి రూ.40,433లకు చేరుకుంటుందని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్ శెట్టి చెప్పారు.
బ్యాంక్ ——————- 2022 మార్చి —- ప్రస్తుత వడ్డీరేటు ———— వడ్డీలో వృద్ధి
ఎస్బీఐ ——————- 6.75% ———– 7.55% ————————– 0.80%
పీఎన్బీ ——————- 6.50% ———– 7.40% ————————– 0.90%
బీవోఐ ——————– 6.50% ———– 7.45% ————————- 0.95%
కెనరాబ్యాంక్ ———— 6.90% ———- 7.60% ————————– 0.70%
ఎల్ఐసీ హౌసింగ్ —— 6.90% ———- 7.55% ————————— 0.65%
యూనియన్ బ్యాంక్ —- 6.60% ———-7.40% ————————– 0.80%
బ్యాంక్ ——————- 2022 మార్చి —- ప్రస్తుత వడ్డీరేటు ———— వడ్డీలో వృద్ధి
ఐసీఐసీఐ ————— 6.85% ———– 8.85% ————————– 2.00%
హెచ్డీఎఫ్సీ ————- 6.70% ———– 7.55% —————————- 0.85%
సిటీ బ్యాంక్ ———— 6.50% ———– 6.65% ————————— 0.15%
యాక్సిస్ బ్యాంక్ ——- 6.90% ———- 7.60% —————————- 0.70%
కొటక్‌మహీంద్రా ——- 6.55% ———- 7.50% —————————- 0.95%