ముంబై, ఫిబ్రవరి 24 : రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడంతో ఒక్కో బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఇత ర బ్యాంకులు రెపో రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. దీంట్లోభాగంగా యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్లు తమ గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గించాయి. 20 ఏండ్ల కాలపరిమితితో గృహ రుణాలు తీసుకున్న వారికి ఈ రెండు బ్యాంకులు 8.10 శాతంవడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. అంటే లక్ష రూపాయల రుణంపై ఈఎంఐ రూ.843గా నిర్ణయించింది. మిగతా బ్యాంకులు కూడా ఈ స్థాయిలోనే వడ్డీరేట్లను వసూలు చేస్తున్నాయి.