గృహ రుణాలపై ఎస్బీఐ పండగ ఆఫర్
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి సైతం గృహ రుణాల వడ్డీరేటుపై రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ క్రెడిట్ స్కోర్ (151-200) కలిగిన వారితోపాటు క్రెడిట్ స్కోర్ లేని వారికి కూడా 65 బేసిస్ పాయింట్లు, 45 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ కల్పిస్తున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి సైతం గృహ రుణాల వడ్డీరేటుపై రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ క్రెడిట్ స్కోర్ (151-200) కలిగిన వారితోపాటు క్రెడిట్ స్కోర్ లేని వారికి కూడా 65 బేసిస్ పాయింట్లు, 45 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ కల్పిస్తున్నది. దీంతోపాటు 750 కంటే అధిక స్కోర్ కలిగిన వారికి కూడా 55 బేసిస్ పాయింట్లు రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే.
వీరికి 8.60 శాతం వడ్డీకి గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. నాలుగు నెలలపాటు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక క్యాంపెన్ డిసెంబర్ 31న ముగియనున్నది. 700 నుంచి 749 క్రెడిట్ స్కోర్‌తోపాటు 151 నుంచి 200 లోపు స్కోర్ కలిగిన ఖాతాదారులకు వడ్డీరేటును 9.35 శాతం నుంచి 8.70 శాతానికి దించింది. 750 కంటే అధిక స్కోర్ కలిగిన వారికి 8.40 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..700-749 లోపు వారికి 8.50 శాతం విధిస్తున్నది. జూన్‌తో ముగిసేనాటికి బ్యాంక్ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో 13. 47 శాతం పెరిగి రూ.6,52,548 కోట్లకు చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

