Home Loans | మహిళలకు పలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)లు తక్కువ వడ్డీరేటుపై ఇండ్ల రుణాలు మంజూరు చేస్తాయి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. లోన్ టెన్యూర్‌లో గణనీయంగా ఖర్చులు తగ్గుతాయి. మహిళా రుణ గ్రహీతలకు పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రాయితీలు ఆఫర్ చేస్తున్నాయి. అలా ఇండ్ల రుణాలపై మహిళా రుణ గ్రహీతలకు కొన్ని బ్యాంకులు ఇస్తున్న ఆఫర్లు పరిశీలిద్దామా.. !
మహిళా రుణ గ్రహీతలకు ఇండ్ల రుణాలపై వడ్డీరేటులో 5 బేసిక్ పాయింట్లు రాయితీ ఇస్తుంది. వారి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీరేటు 9.15 నుంచి 10.15 శాతం మధ్య ప్రారంభం అవుతుంది.
మహిళా రుణ గ్రహీతలకు హెచ్డీఎఫ్సీ సైతం ఐదు బేసిక్ పాయింట్ల వడ్డీ రాయితీ ఇస్తుంది. వారి సిబిల్ స్కోర్, తీసుకునే రుణాన్ని బట్టి 8.95 నుంచి 9.85 శాతం వడ్డీరేటు ఖరారవుతుంది. మహిళలు రూ.30 లక్షల వరకు రుణం తీసుకుంటే వడ్డీరేటు 8.95-9.45 శాతం వరకు, రూ.30.01 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు 9 నుంచి 9.50 శాతం, రూ.75.01 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారికి 9.30-9.80 శాతం మధ్య వడ్డీరేటు ఖరారవుతుంది.
కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు కూడా మహిళలు తీసుకునే ఇండ్ల రుణాలపై వడ్డీరేటు ఐదు బేసిక్ పాయింట్లు తగ్గిస్తాయి. కెనరా బ్యాంకులో ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 8.85 శాతం నుంచి మొదలవుతుంది.
ఇండ్ల కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ చెల్లింపు అదనపు ఖర్చుగా నిలుస్తుంది. మహిళల ఆధ్వర్యంలో ఇండ్ల కొనుగోలును ప్రోత్సహించడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలో ఒకటి నుంచి రెండు శాతం రాయితీ కల్పిస్తున్నాయి. దీనివల్ల గణనీయ మొత్తం ఆదా అవుతుంది.
ఇండ్ల రుణాలపై పన్ను మినహాయింపు బెనిఫిట్ ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. రుణంలో అసలు మొత్తం చెల్లింపుపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. భార్యాభర్తలు తమ వ్యక్తిగత ఆదాయం ద్వారా ఉమ్మడిగా ఇల్లు కొనుగోలు చేసినట్లయితే వారిరువురు పన్ను బెనిఫిట్లు పొందడానికి అర్హులవుతారు.