HMD Skyline | నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్లు తయారుచేసే ఫిన్లాండ్ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన సొంత బ్రాండ్ పేరిట స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. యూరప్ దేశాల్లో ఆవిష్కరించిన రెండు నెలల తర్వాత ‘హెచ్ఎండీ స్కైలైన్’ అనే పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్, సెల్ఫ్ రిపేర్ కిట్ తోపాటు 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. యూజర్లు డిస్ ప్లే, బ్యాటరీతోపాటు వివిధ విడి భాగాలను డిసెంబుల్ చేసి, రీ ప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుందీ స్మార్ట్ ఫోన్. 108 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
హెచ్ఎండీ స్కైలైన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999 పలకుతుంది. నియాన్ పింక్, ట్విస్టెడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్‌తోపాటు హెచ్ఎండీ ఇండియా వెబ్సైట్, ప్రముఖ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో లభ్యమవుతుంది. హెచ్ఎండీ స్కైలైన్ ఫోన్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1800×2400 పిక్సెల్స్) పోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ కలిగి ఉంటుంది.
హెచ్ఎండీ స్కైలైన్ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 108 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 13 మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. లెఫ్ట్ ఎడ్జ్ వైపు కస్టమ్ బటన్ ఉంటుంది. వేర్వేరు ఫంక్షనింగ్ ల కోసం కస్టమ్ బటన్ పని చేస్తుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల రీప్లేసబుల్ బ్యాటరీ ఉంటుంది. 15వాట్ల మ్యాగ్నటిక్ వైర్ లెస్, 5వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతు కలిగి ఉంటుందీ బ్యాటరీ. వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కోసం చార్జర్ విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తోందీ స్మార్ట్ ఫోన్.