HMD Pulse 2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ (HMD) తన హెచ్ఎండీ పల్స్ 2 ప్రో (HMD Pulse 2 Pro) ఫోన్ ను త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ యూనీసోక్ టీ612 ఎస్వోసీ ప్రాసెసర్, 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో హెచ్ఎండీ పల్స్ ప్రో ఫోన్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్, 6.65 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. బ్లాక్ ఓషన్, గ్లేసియర్ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ రంగుల్లో లభించే హెచ్ఎండీ పల్స్ ప్రో ఫోన్ ధర రూ.16 వేలు (180 యూరోలు) పలికింది. తాజాగా మార్కెట్లోకి రానున్న హెచ్ఎండీ పల్స్ 2 ప్రో ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు స్క్వేర్ షేప్డ్ కెమెరా ఐలాండ్ ప్లస్ డ్యుయల్ రేర్ కెమెరా ఉంటాయి.
త్వరలో రానున్న హెచ్ఎండీ పల్స్ 2 ప్రో ఫోన్ బ్లూ, గ్రీన్, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ ప్లే, యూనిసోక్ టీ612 ఎస్వోసీ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. హెచ్ఎండీ పల్స్ 2 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. 20 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో రానున్నది.