న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను హిందుస్థాన్ జింక్ మరోమారు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది నాల్గోసారవగా, ఒక్కో షేర్‌కు రూ.26 చొప్పున మొత్తం రూ.10, 986 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా మొత్తంగా డివిడెండ్ల విలువ ఒక్కో షేర్‌కు రూ.75.50కు చేరింది.
కాగా, ఈసారి డివిడెండ్‌లో రూ.7,132 కోట్లు వేదాంతకే వెళ్లనున్నాయి. గత ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి హిందుస్థాన్ జింక్‌లో వేదాంతకు 64.92 శాతం వాటా ఉన్నది. కేంద్రానికి 29.54 శాతం వాటా ఉండటంతో రూ.3,000 కోట్లకుపైగా రానున్నాయి.