హిండెన్‌బర్గ్‌పై నిషేధం లేదుప్రచారం అవాస్తవం: వ్యవస్థాపకుడు అండర్సన్
అదానీ గ్రూప్ సంపద 100 బిలియన్ డాలర్ల మేర తరిగిపోవడానికి కారణమైన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్‌పై వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కొట్టివేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: అదానీ గ్రూప్ సంపద 100 బిలియన్ డాలర్ల మేర తరిగిపోవడానికి కారణమైన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్‌పై వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కొట్టివేశారు. హిండెన్‌బర్గ్‌పై నిషేధమేదీ లేదని, బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపచేయలేదని, దానిపై ఎటువంటి దర్యాప్తూ జరగడం లేదని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కార్పొరేట్ మోసాలపై జనవరి 24న నివేదికను ప్రచురించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వస్తున్నాయి.
అమెరికాలో హిండెన్‌బర్గ్‌పై మూడు క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయని, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ అథారిటీ (ఎఫ్ఐఎన్ఆర్ఏ) నిషే ధం విధించిందని, న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్వైఎస్ఈ)లో లిస్టయిన కంపెనీలపై ఎటువంటి నివేదికనూ ప్రచురించకుండా నిషేధించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాల ఆధారంగా మీడియాలో వార్తలు సైతం వెలువడుతున్నాయి. ఈ వార్తలు అసత్యాలంటూ అండర్సన్ ట్వీట్ చేశారు. ఎఫ్ఐఎన్ఆర్ఏ తమను ఎప్పుడూ నిషేధించలేదని, తమ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయలేదని, ఎన్వైఎస్ఈ లిస్డెడ్ కంపెనీలపై నివేదికలు ప్రచురించరాదనడం ఒక విషయమే కాదని వివరించారు. అదానీ గ్రూప్‌పై నివేదిక వెలువడిన నెలన్నర ముందే ఎన్వైఎస్ఈ లిస్టెడ్ కంపెనీ వెల్టవర్పై 2022 డిసెంబర్ 7న హిండెన్‌బర్గ్ ఒక రిపోర్ట్‌ను ప్రచురించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

