Hero Vida V2 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) దేశీయ మార్కెట్లోకి నూతన శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘హీరో విదా వీ2 (Hero Vida V2)’ ఆవిష్కరించింది. మాస్ స్కూటర్ల మార్కెట్లోకి హీరో విదా వీ2 స్కూటర్ ఎంటరైంది. మూడు వేరియంట్లలో హీరో విదా వీ2 (Hero Vida V2) వస్తున్నది. హీరో విదా 2 లైట్ (Hero Vida V2 Lite) రూ.96,000 (ఎక్స్ షోరూమ్), హీరో విదా వీ2 ప్లస్ (Hero Vida V2 Plus) రూ.1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాప్ వేరియంట్ హీరో విదా వీ2 ప్రో (Hero Vida V2 Pro) రూ.1.35 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. వేరియంట్ల వారీ స్కూటర్లకు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి.
హీరో విదా వీ2 (Hero Vida V2) ఫోన్ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. సింగిల్ చార్జింగ్‌తో 94 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటలకు 69 కిమీ దూరం ప్రయాణిస్తుంది. రెండు రైడ్ మోడ్స్ – రైడ్, ఎకో మోడ్స్ లో లభిస్తుంది. రిమూవబుల్ బ్యాటరీ సుమారు ఆరు గంటల్లో 80 శాతం వరకూ చార్జింగ్ అవుతుంది. ఇది టీవీఎస్ ఐక్యూబ్ 2.2, బజాజ్ చేతక్ 2903 స్కూటర్లతో పోటీ పడుతుంది.
హీరో విదా వీ2 ప్లస్ స్కూటర్ 3.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. సింగిల్ చార్జింగ్ తో 143 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటలకు 85 కి.మీ దూరం వెళ్లొచ్చు. ఎకో, రైడ్, స్పోర్ట్ మోడ్స్‌లో వస్తున్నది.
హీరో విదా వీ2 ప్రో స్కూటర్ అత్యధికంగా 3.94 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సింగిల్ చార్జింగ్ తో 165 కి.మీ, గరిష్టంగా గంటకు 90 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ మోడ్స్‌లో లభిస్తుంది. విదా వీ1 (Vida V1) స్కూటర్ తరహాలోనే విదా వీ2 స్కూటర్లు ఉంటాయి. మ్యాట్ నెక్సస్ బ్లూ-గ్రే, గ్లాసీ స్పోర్ట్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. విదా వీ2 ప్రో స్కూటర్ స్విన్ గ్రామ్ మౌంటెడ్ పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ తో వస్తోంది. గరిష్టంగా 6 కిలోవాట్ల విద్యుత్ 25 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.