Hero MotoCorp Discounts | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. తన ఎలక్ట్రిక్ ‘విదా వీ1 ప్లస్ (Vida V1 Plus)’ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది. త్వరలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విదా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్ మీద హీరో మోటో కార్ప్ డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.32 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి రూ.25 వేలు, అమెజాన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి రూ.32 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విదా వీ1 ప్లస్’ ధర మొత్తం చెల్లింపులు చేసిన వారికి అమెజాన్ రూ.27 వేల వరకూ రాయితీ ప్రకటించింది. సెలెక్డెడ్ బ్యాంకు కార్డుల ద్వారా ఈఎంఐ పేమెంట్స్ చేసే వారికి రూ.32 వేల డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్లతో విదా వీ1 ప్లస్ స్కూటర్ రూ.91 నుంచి రూ.94 వేల ధరకే లభిస్తుంది.
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లోకి ఆలస్యంగా ఎంటరైనా హీరో మోటో కార్ప్ విదా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్ కు ఆదరణ బాగానే ఉంది. బోల్డ్ అండ్ మస్క్యులర్ డిజైన్ తో వస్తున్న విదా వీ1 ప్లస్ స్కూటర్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, 7- అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లే, కీ లెస్ ఎంట్రీ, 26 -లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ, మూడు వేర్వేరు రైడింగ్ మోడ్స్ లో లభిస్తుంది. ట్యూబ్ లెస్ టైర్స్ తోపాటు ర్యాప్డ్ అల్లాయ్ వీల్స్, సస్పెన్షన్ డ్యూటీ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా ఉంటాయి.
3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న విదా వీ1 ప్లస్ ఈవీ స్కూటర్ సింగిల్ చార్జింగ్ తో 143 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 3.4 సెకన్లలో 40 కి.మీ వేగం పుంజుకుంటుంది. గరిష్టంగా గంటకు 80 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఐదేండ్లు లేదా 50 వేల కి.మీ వారంటీ అందుబాటులో ఉంటుంది.