న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు రూ.456.06 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు వచ్చింది. రాజస్థాన్‌లోని అల్వార్ సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ నుంచి ఈ తాఖీదులు అందాయి. 2017 జూలై నుంచి 2024 మార్చి వరకు సరఫరా జరిగిన వాహన విడిభాగాలు, ఇతరత్రా వాటి ధరలకు సంబంధించిన వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
మరోవైపు ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి కూడా రూ.101. 95 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు వచ్చింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాలకుగాను ఆయా రాష్ర్టాల్లో జీఎస్టీ షార్ట్ పేమెంట్లకు సంబంధించి ఈ నోటీసు విడుదలైందని మంగళవారం ఎల్ఐసీ తెలిపింది. కాగా, త్వరలో జీఎస్టీ శ్లాబులు, రేట్లపై జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు.