Hero MotoCorp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో గణనీయ వృద్ధిరేటు నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.825 కోట్ల నికర లాభం గడించిన హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) ఈ ఏడాది 36శాతం వృద్ధితో రూ.1,123 కోట్ల నికర లాభం గడించింది. ఆపరేషన్స్ ద్వారా 16శాతం పురోగతితో రూ.8,767 కోట్ల నుంచి రూ.10,144 కోట్ల ఆదాయం పెంచుకున్నది. కానీ ఆదాయం, లాభాల్లో మార్కెట్ అంచనాల కంటే తక్కువ వృద్ధి సాధించింది. మార్కెట్ వర్గాలు హీరో మోటో కార్ప్ రూ.1,184 కోట్ల నికర లాభం, రూ.10,477 కోట్ల ఆదాయం సంపాదిస్తుందని అంచనా వేశాయి.
దేశంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈవీ స్కూటర్లతోపాటు జాతీయంగా, అంతర్జాతీయంగా పాజిటివ్ ధోరణి నెలకొందని తెలిపింది. రిటైల్స్ సేల్స్ లోనూ మెరుగుదల ఉందని పేర్కొంది. కస్టమర్ల నుంచి పాజిటివ్ సెంటిమెంట్స్, సానుకూల నైరుతి రుతు పవనాలతోపాటు ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో పలు ఐసీఈ/ ఈవీ స్కూటర్లు, మోటారు సైకిళ్లు ఆవిష్కరిస్తామని తెలిపింది. న్యూ మోడల్ ఎక్స్ ట్రీమ్ 125 సీసీ స్కూటర్లతో 125సీసీ సెగ్మెంట్లో రికవరీ సాధించామని సంస్థ సీఈఓ నిరంజన్ గుప్తా తెలిపారు. ఎంట్రీ, డీలక్స్ 100/110 సీసీ సెగ్మెంట్లో స్ప్లెండర్, పాషన్, హెచ్ఎఫ్ డీలక్స్ వంటి మోటారు సైకిళ్లు 70 శాతానికి పైగా విక్రయం జరుగుతున్నదన్నారు. తమ ఈవీ బ్రాండ్ ‘విదా’ సేల్స్ పెరగడంతోపాటు మార్కెట్ వాటా పెంచుకుంటున్నదని చెప్పారు.
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!