న్యూఢిల్లీ, జూలై 13 : దేశీయ మార్కెట్లోకి హీరో మోటోకార్ప్ సరికొత్త ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. విదా ఈవూటర్ వీఎక్స్2 ప్లస్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.1,43,990గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 4.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 187 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
కేవలం మూడున్నర గంటల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జికానున్నది. సుదూర ప్రయాణాలు చేసేవారికి ఈ స్కూటర్ ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 6 వేల ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు, 700కి పైగా సర్వీస్ టచ్పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.