700 బిలియన్ డాలర్లకు హెల్త్‌కేర్ రంగం
దేశీయ హెల్త్‌కేర్ రంగం వచ్చే ఐదేండ్లలో 700 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 300 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్‌కేర్ రంగం 2029-30 నాటికి రెండింతలు కంటే అధికంగా పెరిగి 700 బిలియన్ డాలర్ల (58 లక్షల కోట్లు)కు చేరుకోనున్నట్టు ప్రాక్సిస్ గ్లోబల్ అలయెన్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ హెల్త్‌కేర్ రంగం వచ్చే ఐదేండ్లలో 700 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 300 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్‌కేర్ రంగం 2029-30 నాటికి రెండింతలు కంటే అధికంగా పెరిగి 700 బిలియన్ డాలర్ల (58 లక్షల కోట్లు)కు చేరుకోనున్నట్టు ప్రాక్సిస్ గ్లోబల్ అలయెన్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
అంతర్జాతీయ దేశాల్లో హెల్త్‌కోసం పెడుతున్న ఖర్చులో భారత్‌లో కేవలం ఒక్క శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు ‘ఇండియా హెల్త్ ఫైనాన్సింగ్ పొజిషన్ పేపర్ 2026’లో వెల్లడించింది. మరోవైపు, మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి 2035 నాటికి హెల్త్‌కేర్ రంగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది.
ఒక్క మిలియన్ డాలర్ల పెట్టుబడితో గరిష్ఠంగా 23-27 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వాలతోపాటు ప్రైవేట్ రంగాలు సంయుక్తంగా భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ప్రతి వెయ్యి మందికీ 0.9 డాక్టర్లు, 1.8 నర్సులు, 1.6 బెడ్స్ ఉన్నాయి. 2035 నాటికి మరో 10 లక్షల మంది డాక్టర్లు, 35 లక్షల మంది నర్సులు అవసరమవుతాయని నివేదిక అంచనావేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

