ముంబై, ఆగస్టు 14: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ‘బర్నీ సే ఆజాదీ’ 5వ ఎడిషన్ను ప్రారంభించింది. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛే లక్ష్యంగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమాన్ని సంస్థ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, సంప్రదాయ పొదుపు పద్ధతులను దాటి కొత్త పెట్టుబడుల వైపు మహిళలను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని గురువారం ఓ ప్రకటనలో హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ, సీఈవో నవ్నీత్ మున్నట్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో భాగంగా అన్ని రాష్ర్టాల్లో వీధి నాటకాలను ప్రదర్శించనున్నట్టు చెప్పారు.