హెచ్డీఎఫ్సీ అంచనాలు మిస్
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.17,257.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.17,257.87 కోట్ల కంటే ఇది కేవలం 2.11 శాతం అధికం.
- క్యూ4లో 17,258 కోట్ల లాభం
ముంబై, ఏప్రిల్ 20: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.17,257.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.17,257.87 కోట్ల కంటే ఇది కేవలం 2.11 శాతం అధికం. ఏడాది క్రితం రూ.18,170 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం గత త్రైమాసికానికి రూ.29,080 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. నికర లాభం విషయానికి వస్తే స్వల్పంగా పెరిగి రూ.16,373 కోట్ల నుంచి రూ.16,511 కోట్లకు చేరుకున్నది.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.24 శాతంగా ఉన్నది. గతేడాది ఇది 1.26 శాతంగా ఉన్నది. నికర ఎన్పీఏ 0.31 శాతం నుంచి 0.33 శాతానికి పెరిగింది.
- గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ రూ.19.5 డివిడెండ్‌ను ప్రతిపాదించింది.
- బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.60 వేల కోట్ల నిధుల సేకరణకు సంబంధించి బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.13,500 కోట్ల నిధులు వెచ్చించింది. ఏడాది క్రితం ఇది రూ.10,900 కోట్లు కేటాయించింది.
- గత త్రైమాసికంలో 650 శాఖలను ప్రారంభించడంతో మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 8,738కి చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

