హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూన్ 9: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు అన్ని రకాల కాలపరిమితి కలిగిన రుణాలకు వర్తించనున్నదని పేర్కొంది. పెరిగిన వడ్డీరేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని తెలిపింది. రెండేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో వడ్డీరేటు 8.45 శాతం నుంచి 8.55 శాతానికి ఎగబాకింది.
అలాగే ఏడాది కాలపరిమితితో రుణాలపై ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణ రేటు 8.40 శాతానికి చేరుకున్నది. ఏడాది కాలపరిమితితో ఎక్కువగా వాహన, వ్యక్తిగత, గృహ రుణాలు తీసుకుంటున్నారు. వీటితోపాటు ఒక్కరోజు, మూడు, ఆరు నెలలు, మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో వరుసగా 8.10 శాతం, 8.20 శాతం, 8.35 శాతం, 8.65 శాతానికి చేరుకున్నాయి. రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

