HDFC Bank Expansion Plan | రెండేండ్లలో గ్రామాల్లో రెట్టింపు శాఖలు
HDFC Bank Expansion Plan | వచ్చే 24 నెలల్లో తమ శాఖలను రెండు లక్షలకు పెంచాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.

HDFC Bank Expansion Plan | దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వచ్చే ఆరు నెలల్లో 2,500 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. వచ్చే 18-24 నెలల్లో తమ శాఖల నెట్‌వర్క్‌ను రెండు లక్షలకు పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుల శాఖలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది.
ఇందులో బిజినెస్ కరస్పాండెంట్లు, బిజినెస్ ఫెసిలిటేటర్లు, కామన్ సర్వీస్ సెంటర్ల పార్టనర్లు, వర్చువల్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డిజిటల్ ఔట్రీచ్ ప్లాట్‌ఫామ్స్ తదితరాలు ఉంటాయి. రెండేండ్లలో దేశంలోని మూడోవంతు గ్రామాలకు తమ బ్యాంకు నెట్వర్క్ విస్తరిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.
గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లకు రుణపరపతి అందుబాటులో లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా చెప్పారు. మున్ముందు ప్రతి పల్లెకు తమ సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 550 జిల్లాల్లో బ్యాంకు సేవలందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

