శనివారం 06 మార్చి 2021
Business - Feb 07, 2021 , 20:05:38

IT Returns స‌మ‌ర్పించ‌లేదా? ఇక‌ టీడీఎస్ త‌డిసిమోపెడు!

IT Returns స‌మ‌ర్పించ‌లేదా? ఇక‌ టీడీఎస్ త‌డిసిమోపెడు!

న్యూఢిల్లీ: ‌మీరు ఆదాయం ప‌న్ను రిట‌ర్న్స్ (ఐటీఆర్‌) స‌మ‌ర్పించ‌లేదా..! అయితే మీకు వివిధ ఆదాయాలు, వాటిపై వ‌చ్చే వ‌డ్డీపై భారీగా టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. గ‌త‌వారం 2021-22 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌తిపాదించారు. ఒక వ్య‌క్తి రెండేండ్లుగా రూ.50వేల మేర‌కు టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో చెల్లిస్తున్నార‌ని అనుకుందాం.. ఆ వ్య‌క్తి ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌కుండా ఉండిపోతారు. అటువంటి ప‌ద్ద‌తిని నిరుత్సాహ ప‌రిచేందుకే ఈ ప్ర‌తిపాద‌నను కేంద్ర ఆర్థిక మంత్రి తీసుకొచ్చారు. రెండేండ్లుగా రూ.50 వేల వ‌ర‌కు టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో ప‌న్ను చెల్లించిన వారిపై రెట్టింపు అంత‌కంటే ఎక్కువ టీసీఎస్ లేదా టీడీఎస్ వ‌సూలు చేస్తారు. 

అయితే, ఈ నిబంధ‌న వేత‌న ఆదాయం, ఎన్నారై చెల్లింపులు, లాట‌రీ ఆదాయానికి వ‌ర్తించ‌ద‌ని కేంద్ర ఆర్థిక శాఖ వ‌ర్గాలు తెలిపాయి. ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌కుండా ఉండిపోయిన వారి నుంచి అధిక టీడీఎస్ వ‌సూలు చేయ‌డానికి ఆదాయం ప‌న్ను చ‌ట్టానికి కేంద్ర ఆర్థిక మంత్రి 206ఏబీ అనే సెక్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దీంతోపాటు నూత‌నంగా 206 సీసీఏ సెక్ష‌న్ కింద అధిక టీసీఎస్ రేటు వ‌ర్తిస్తుంది. పెట్టుబ‌డుల నుంచి వ‌చ్చే ఆదాయం, యాన్యూటీ పెన్ష‌న్‌, డివిడెండ్ ఆదాయం, వ‌డ్డీ రూపేణా వ‌చ్చే ఆదాయంపై అధిక టీడీఎస్ విధానం వ‌ర్తింప‌జేస్తారు. 

అంతేకాదు.. ఆదాయం ప‌న్ను చట్టం-1961లోని 192 (వేత‌న ఆదాయం), 192ఏ (పీఎఫ్‌), 194బీ (లాట‌రీ విజ‌యంతో ఆదాయం), 194 బీబీ (గుర్రాల రేసులో గెలుపు), 194ఎల్‌బీసీ (సెక్యూరిటైజేష‌న్ ట్ర‌స్ట్ నుంచి ఆదాయం) లేదా 194 ఎన్ (రూ.20 ల‌క్ష‌ల‌కు పైగా న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్స్‌) సెక్ష‌న్ల వారికి ఈ నూత‌న సెక్ష‌న్ వ‌ర్తించ‌దు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo