న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మరో అరడజన్ వాహన సంస్థలు తమ వాహన ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. వీటిలో కియా ఇండియా, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్, ఆడీ, నిస్సాన్, లెక్సస్, టీవీఎస్లు ఉన్నాయి.
కియా, ఎంజీ మోటర్, ఆడీ ధరలు వెంటనే అమలులోకి రాగా, కానీ నిస్సాన్, లెక్సస్ వాహన ధరలు మాత్రం ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. టీవీఎస్ మోటర్ వాహన ధరలను తగ్గించేదానిపై కసరత్తు చేస్తున్నది.