న్యూఢిల్లీ, ఆగస్టు 26: జీఎస్టీ సంస్కరణలత ప్రస్తుతం ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తుందని, ఔషధ పరిశ్రమకు హేతుబద్దమైన, పరిశ్రమకు అనుకూలమైన పన్ను చట్టాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని రెడ్డీస్ ఫార్మా ఆశాభావం వ్యక్తం చేసింది. చాలాకాలంగా ఔషధ రంగం నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వీటిలో అధిక జీఎస్టీ, విలోమ సుంకాలు కూడా ఉన్నాయని, ఇవి దేశీయ తయారీ ఖర్చు సామర్థ్యాన్ని, ఔషధాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతాయని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ జీఎస్టీ సంస్కరణలపై ఆశావాదంగా ఉన్నట్టు, పన్నులు హేతుబద్దీకరించడం, పారిశ్రామిక స్నేహపూర్వక నిర్ణయాలతో ప్రతీ పౌరుడికి అవసరమైన మందులు చౌకగా లభించనున్నాయని, దీంతో దేశీయ ఔషధ రంగం ప్రపంచంలో పోటీతత్వం పెంచడంతోపాటు ఆవిష్కరణ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.