న్యూఢిల్లీ, నవంబర్ 15: అన్ని జీఎస్టీ యాంటీ-ప్రాఫిటీరింగ్ ఫిర్యాదులను వచ్చే నెల 1 నుంచి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)నే పరిశీలించనున్నది. నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ (ఎన్ఏఏ) కాలం ఈ నెలాఖరుతో తీరిపోనున్న క్రమంలో ఇక సీసీఐనే ఫిర్యాదులను చూడనుందని మంగళవారం సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఓ ప్రకటన వెలువడుతుందన్నారు. 2017 నవంబర్లో ఎన్ఏఏను ఏర్పాటు చేశారు. 2019 వరకే దీని కాలపరిమితి ఉండగా.. 2021దాకా పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ ఈ నెలాఖరు వరకు పెంచిన సంగతి విదితమే.