న్యూఢిల్లీ, మే 1: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో ఆల్టైమ్ హై రికార్డును నెలకొల్పాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్లో రూ.2.43 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దీంతో నిరుడు ఏప్రిల్లో నమోదైన రూ.2.23 లక్షల కోట్ల రికార్డు చెరిగిపోయింది. దిగుమతుల నుంచి వచ్చే పన్ను వసూళ్లు ఏకంగా 25.8 శాతం పుంజుకొని రూ.57,580 కోట్లకు చేరడమే ఇందుకు కారణమని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇదిలావుంటే తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు జరిగాయి. రూ.4,621 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్లో రూ.3,433 కోట్లుగానే ఉన్నాయి.
రూ.15 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, మే 1: గత ఏడాదికిగాను ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీని మొత్తంగా రూ.15 లక్షల కోట్లు (158 బిలియన్ డాలర్లు)గా టెస్లా ప్రకటించింది. అయితే ఇందులో ఎక్కువ ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలే. వాస్తవంగా పొందే ఆదాయం తక్కువే. మస్క్ టెస్లా సీఈవోగా ఉన్నారు.