నెమ్మదించిన కీలక రంగాలు.. జనవరిలో 4 శాతం మాత్రమే
గత కొన్ని నెలలో దూసుకుపోయిన కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. జనవరి నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రెండు నెలల కనిష్ఠ స్థాయి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
- రెండు నెలల కనిష్ఠానికి వృద్ధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : గత కొన్ని నెలలో దూసుకుపోయిన కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. జనవరి నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రెండు నెలల కనిష్ఠ స్థాయి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అలాగే డిసెంబర్ 2025లో నమోదైన 4.7 శాతం కంటే తక్కువగా నమోదు కావడం విశేషం. క్రూడాయిల్, సహజ వాయువు ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్లనే కీలక రంగాల్లో నిస్తేజం ఆవహించిందని పేర్కొంది. అలాగే రిఫైనరీ ఉత్పత్తి స్థిరంగా నమోదైంది. దీంతోపాటు బొగ్గు, సిమెంట్ రంగాల్లో వృద్ధి 3.1 శాతంగాను, 10.7 శాతానికి పరిమితమయ్యాయి.
క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఉత్పత్తి 4.6 శాతం, 14.3 శాతంగా ఉన్నాయి. కానీ, ఎరువులు, స్టీల్, విద్యుత్ ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో కీలక రంగాల్లో వృద్ధి 2.8 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది 4.5 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ..ఎనిమిది కీలక రంగాల్లో ఏడు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుండటం వల్లనే మందిగించాయన్నారు. కీలక రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా మొత్తం జనవరి నెలకుగాను పారిశ్రామిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. జనవరి నెలలో పారిశ్రామిక వృద్ధి 5.5 శాతంగా ఉంటుందని ఇక్రా అంచనావేస్తున్నది. డిసెంబర్ నెలకుగాను 7.8 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

