హైదరాబాద్, నవంబర్ 9: ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం రూ.102.10 కోట్లకు తగ్గింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.145 కోట్ల లాభంతో పోలిస్తే 30 శాతం తగ్గింది. కానీ, ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 3 శాతం ఎగబాకి రూ.1,189.50 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.