ఐడీబీఐని అమ్మేస్తాం
ఈ ఏప్రిల్‌తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మేస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండే మాట్లాడుతూ.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు.
- మరికొద్ది నెలల్లో పనైపోతుంది
- ప్రైవేటీకరణకు ఆర్బీఐ అనుమతే తరువాయి
- దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఈ ఏప్రిల్‌తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మేస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండే మాట్లాడుతూ.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ వ్యూహాత్మక విక్రయం పూర్తవుతుందన్న ధీమాను కనబర్చారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వ్యవస్థీకృత ఆమోదం లభిస్తే.. బ్యాంక్‌ను కొనేందుకు ఆసక్తి ఉన్నవారిని బిడ్ల ద్వారా ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో పరోక్షంగా, ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 95 శాతం వాటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉండగా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు 49.24 శాతం వాటా ఉన్నది. ఇందులో అటు కేంద్రం, ఇటు ఎల్ఐసీ కలిసి దాదాపు 61 శాతం వాటాను అమ్మేయాలని చూస్తున్నాయి. ఇక 2022 అక్టోబర్‌లోనే బిడ్లను ఆహ్వానించగా, నిరుడు జనవరిలో కొంటామని కొందరు ముందుకు వచ్చినట్టు దీపం వర్గాలు చెప్తున్నాయి. కాగా, వచ్చే నెలాఖర్లోగా ఖజానాకు రూ.17,500 కోట్ల నిధులను కేంద్రం తెచ్చుకో వాల్సి ఉన్నది. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణతో రూ.30,000 కోట్లను ఖజానాకు తరలించాల్సి ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

