Cooking Gas Rates | వంట గ్యాస్ ధర 62 శాతం పెంచుతున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. ఆటోమొబైల్స్‌లో ప్రత్యేకించి ఆటోలు, కార్లను నడిపేందుకు వాడే సీఎన్జీ, కుకింగ్ గ్యాస్‌గా మార్చే సహజ వాయువు ధర పెంచుతున్నట్లు తెలిపింది. ఫర్టిలైజర్లు, విద్యుత్ తయారీకి కూడా ఇదే సహజ వాయువును ఉపయోగిస్తున్నారు. 2019 ఏప్రిల్ తర్వాత భారీ స్థాయిలో గ్యాస్ ధర పెంచడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
దీనివల్ల ఢిల్లీ, ముంబైల్లో పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తున్న కుకింగ్ గ్యాస్, సీఎన్జీ గ్యాస్‌పై ధరలు 10-11 శాతం పెరుగవచ్చునని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. విద్యుత్ తయారీకి ఉపయోగించే గ్యాస్ ధర పెంపు ప్రభావం విద్యుత్ చార్జీలపైనా ఉంటుంది. అయితే గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ కనుక వినియోగదారులపై దాని ప్రభావం ఉండక పోవచ్చునని తెలుస్తోంది.