Toll Plaza- Nitin Gadkari |పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైంది. ఈ సంగతి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్ సభలో ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
టోల్ ప్లాజాల వద్ద ఎటువంటి ఆటంకాల్లేకుండా ఫాస్టాగ్ తోపాటు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అమలు చేస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా గడ్కరీ తెలిపారు. ఇంకా ఏ జాతీయ రహదారిపైనా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం అమల్లోకి రాలేదని పేర్కొన్నారు. జీఎన్ఎస్ఎస్కు అనుగుణంగా జాతీయ రహదారుల టోల్ నిబంధనలు-2008కి గత సెప్టెంబర్ లో సవరణలు చేశామన్నారు. దీని ప్రకారం ప్రయాణించిన దూరానికే టోల్ ఫీజు చెల్లించాలని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.