వడ్డీరేట్ల తగ్గింపులో సర్కారీ బ్యాంకులే బెస్ట్.. సంగతేంటంటే!
వడ్డీరేట్లలో సర్కారీ బ్యాంకులే బెస్ట్| రెపోరేట్‌కు అనుగుణంగా కీలక వడ్డీరేట్ల తగ్గింపులో ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరే..

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక మెట్టుపైనే ఉన్నాయి. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) క్రమంగా కీలక వడ్డీరేట్లను కనీస స్థాయికి తగ్గించి వేసింది. ఆర్బీఐ రెపోరేట్ తగ్గించినప్పుడల్లా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దాదాపు దాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేశాయి. కానీ ప్రైవేట్ బ్యాంకుల తీరు భిన్నంగా ఉన్నది. గత ఏడాది కాలంలో ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా కీలక వడ్డీరేట్లను తగ్గించిన ప్రైవేట్ బ్యాంకులు సగటున మూడో వంతు మాత్రమే ఉండటమే ఆసక్తికర పరిణామం.
115 బీపీఎస్ తగ్గించిన ఆర్బీఐ
కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవస్థలోని నిధులు వెల్లువెత్తేందుకు వీలుగా.. ఆర్బీఐ తన రెపోరేట్‌ను 115 బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా బ్యాంకుల డిపాజిట్లు/ రుణాల వడ్డీరేట్లు మారుతుంటాయి.
ప్రభుత్వ బ్యాంకుల్లో 1.15 శాతం రిడక్షన్
ప్రభుత్వ రంగ బ్యాంకులు సగటున రుణాలపై వడ్డీరేట్లను 114 బేసిక్ పాయింట్లు (1.15శాతం) తగ్గించేశాయి. 2020 మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వివిధ రుణాలపై వడ్డీరేట్లు 8.64 శాతం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.5 శాతానికి పడిపోయాయి.

ప్రైవేట్ బ్యాంకులు 38 బేసిక్ పాయింట్లకే పరిమితం
కానీ ప్రైవేట్ రంగ బ్యాంకులు మాత్రం సగటున 38 బేసిక్ పాయింట్లు (0.38%), విదేశీ బ్యాంకులు 63 బేసిక్ పాయింట్లు (0.63%) తగ్గించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సగటు వడ్డీరేట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 70 బేసిక్ పాయింట్లు తగ్గిస్తే, ప్రైవేట్ బ్యాంకులు 68 శాతమే తగ్గించాయి.
డిపాజిట్లపై వడ్డీరేట్లలోనే ప్రవేట్ రూటే సెపరేట్
గమ్మత్తేమిటంటే ఖాతాదారుల నుంచి డిపాజిట్ల రేట్లను తగ్గించడంలోనూ ప్రైవేట్ బ్యాంకులు తమ లాభాలే ప్రధానంగా వ్యవహరించాయి. ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్లపై 100 బేసిక్ పాయింట్లు (1.0శాతం) వడ్డీరేట్లు తగ్గిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు 82 బేసిక్ పాయింట్ల (0.82%)కు మాత్రమే పరిమితం అయ్యాయి.
బ్యాంకింగ్‌లో పీఎస్‌యూ బ్యాంకులదే మూడొంతుల వాటా
దేశంలోని బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రత్యేకించి డిపాజిట్లు, రుణాల్లోనూ నాలుగింట మూడొంతుల వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం ఆసక్తికర పరిణామం. కరోనా మొదలైన తర్వాత వివిధ వర్గాల వారికి రుణాలు మంజూరు చేయడంలో ప్రైవేట్, విదేశీ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందున్నాయి.

పీఎస్‌యూ బ్యాంకుల నుంచే కేంద్ర పథకాలు
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే అమలయ్యాయి. ప్రైవేట్/ విదేశీ బ్యాంకులతో పోలిస్తే రిటైల్ రుణాలు మంజూరు చేయడంలోనూ, విడుదల చేయడంలోనూ ప్రభుత్వ బ్యాంకులే చురుగ్గా ముందుకు వెళుతున్నాయి.
వడ్డీరేట్ల తగ్గింపులో ఎస్బీఐ డిఫరెంట్
వ్యవస్థలో ద్రవ్య లభ్యత సాధారణం చేయాలన్న లక్షంతో ముందుకెళుతున్న ఆర్బీఐ మార్గంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తనదైన శైలిలో వడ్డీరేట్లను తగ్గించడానికి పూనుకున్నది. గత (2020-21) ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణాలపై వడ్డీరేటును 6.7 శాతానికి కుదించింది.
ఎస్బీఐ ఇంటిరుణ వడ్డీరేటు ఇదీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎస్బీఐ వడ్డీరేటు (ఇంటి రుణాలు) 6.95 శాతంగా ఉంది. ఎస్బీఐ రుణాల పోర్ట్‌ఫోలియోలో హోం లోన్లదే పెద్ద వాటా.
రియల్ ఎస్టేట్ రంగానికి పరిపుష్టి కలిగించేందుకు సొంతిండ్లు కొనుగోలు చేసే వారికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ తగ్గించడం కూడా రుణాల పెరుగుదలకు మరో కారణంగా కనిపిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి:
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : అథావలే
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

