న్యూఢిల్లీ, జూన్ 30 : చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జూలై 1, 2026 నుంచి సెప్టెంబర్ 30లోపు ఈ నూతన వడ్డీరేట్లు అమల్లో ఉండనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. వరుసగా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇది తొమ్మిదో సారి కావడం విశేషం.
దీంతో సుకన్య సమృద్ధి స్కీమ్ కింద 8.2 శాతం వడ్డీరేటును చెల్లిస్తుండగా, ఇదే స్కీం కింద మూడేండ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్‌పై 4 శాతం, కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.