Google Pixel 9 | గ్లోబల్ టెక్ కంపెనీ గూగుల్ (Google) తన గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9) ఫోన్‌ను టెన్సార్ జీ4 ఎస్వోసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌తో గత ఆగస్టులో ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరపై అందుబాటులో ఉంది. నో-కాస్ట్ ఈఐంఐ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుందీ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.79,999లకు మార్కెట్లో ఆవిష్కరించింది గూగుల్. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లను అనుమతి ఇస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.75,999 పలుకుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్ పనితీరును బట్టి రూ.70 వేల లోపు ధరకు అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ ధర రూ.64,999లకు లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.
నెలకు రూ.13,334తో నో -కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం అవుతుంది. స్క్రీన్ గార్డులు, కేస్ల కోసం ఫ్లిప్ కార్ట్ అదనంగా 15 శాతం కాంబో ఆఫర్ అందిస్తుంది. దీంతోపాటు గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ (Google Pixel 9 Pro XL), గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (Google Pixel 9 Pro Fold) ఫోన్లపైనా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తోపాటు 6.3 అంగుళాల (1080×2424 పిక్సెల్స్) యాక్చువా ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. టెన్సార్ జీ4 ఎస్వోసీ, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్లతో పని చేస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 48-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, క్యూఐ సర్టిఫైడ్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతోపాటు 47000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.