Google | గూగుల్ తన పాత మోడల్ స్మార్ట్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ల ధరలు భారీగా తగ్గించేసింది. గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రకాల గూగుల్ పిక్సెల్ 8 ఫోన్లు, గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్ ఫోన్లపై ధర తగ్గించింది. అన్ని రకాల స్టోరేజీ వేరియంట్లపైనా ధరలు తగ్గించింది. వాటిలో గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ వాస్తవ ధర రూ.1,06,999 కాగా, రూ.99,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇక గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ధర రూ.75,999 నుంచి రూ.71,999లకు తగ్గించేసింది.
గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్లపై రూ.2,000 నుంచి రూ.5000 వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై ఆఫర్లు అదనం. భారత్ మార్కెట్లో గూగుల్ ఆథరైజ్డ్ విక్రయ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా అన్ని ఫోన్లు విక్రయిస్తారు. తాజాగా గూగుల్ ఆవిష్కరించిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయొచ్చు.
పిక్సెల్ మోడల్ – లాంచింగ్ ధర – సవరించిన ధర
గూగుల్ పిక్సెల్8 128 జీబీ స్టోరేజీ – రూ.75,999 – రూ.71,999
గూగుల్ పిక్సెల్8 256 జీబీ స్టోరేజీ – రూ.82,999 – రూ.77,999
గూగుల్ పిక్సెల్8ప్రో 128 జీబీ స్టోరేజీ – రూ.1,06,999 – రూ.99,999
గూగుల్ పిక్సెల్8ప్రో 256 జీబీ స్టోరేజీ – రూ.1,13,999 – రూ.1,06,999
గూగుల్ పిక్సెల్ 8ఏ 128 జీబీ స్టోరేజీ – రూ.52,999 – రూ.49,999
గూగుల్ పిక్సెల్ 8ఏ 256 జీబీ స్టోరేజీ – రూ.59,999 – రూ.56,999
గూగుల్ పిక్సెల్ 7ఏ 128 జీబీ స్టోరేజీ – రూ.43,999 – రూ.41,999