Gemini 3 | ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నది. టెక్ దిగ్గజాలు పోటీపడి కొత్త టూల్స్‌ని పరిచయం చేస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా గూగుల్ జనరేటివ్ ఏఐ మోడల్, జెమిని-3ని మోడల్ని లాంచ్ చేసింది. జెమిని 2.5 స్థానంలో భర్తీ చేయనున్నది. ఇదే ఇప్పటి వరకు తమ మోస్ట్ ఇంటలిజెంట్ మోడల్ అని కంపెనీ చెబుతోంది. ప్రెస్ బ్రీఫింగ్లో కంపెనీ ప్రతినిధులు జెమిని 3 అనేక కీలక పరిశ్రమ బెంచ్‌మార్క్‌లను అగ్రస్థానంలో నిలిపిందని, దాని సామర్థ్యాలను నిరూపించాయని చెప్పారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కంపెనీ మోస్ట్ టాలెంట్ మోడల్‌గా అభివర్ణించారు.
కొత్త ఏఐ మోడల్‌ను సైబర్ దాడుల నుంచి కాపాడేలా రూపొందించినట్లు చెప్పింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వస్తున్న ఏఐ మోడ్‌తో కొత్త ఏఐ మోడల్‌ను ఇంటిగ్రేట్ చేసినట్లు చెప్పింది. గూగుల్ చీఫ్ ఏఐ ఆర్కిటెక్ట్ వ్లోగ్ మాట్లాడుతూ కంపెనీ ఇప్పుడు గతంలో కంటే వేగంగా మోడల్స్‌ను విడుదల చేస్తుందన్నారు. ఈ సారి గూగుల్ జెమిని-3ని తన సెర్చ్ ఇంజిన్‌లో తొలిసారిగా విడుదలతో పాటు ఏకకాలంలో అనుసంధానించినట్లుగా పేర్కొంది. గతంలో అప్డేట్ చేసేందుకు వారాలు, నెలలు పట్టేది. ఏఐ మోడ్‌ని ఉపయోగించి గూగుల్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వినియోగదారులు జెమిని 3ని వినియోగించుకోవచ్చు.
ఈ మోడల్ సంప్రదాయ వెబ్ లింక్స్‌కు బదులుగా సంక్లిష్టమైన ప్రశ్నలకు ఏఐ జెనరేటెడ్ సమాధానాలు ఇస్తుంది. ఇక గూగుల్ కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. గూగుల్ జెమిని ఏజెంట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈ-మెల్ ఇన్‌బాక్స్ నుంచి టూర్ ప్లాన్ వరకు మల్టిపుల్ టాస్క్‌ల వరకు ఆటోమేటిక్‌గా పనులు పూర్తి చేస్తుంది. అలాగే, గూగుల్ కొత్తగా జెమిని యాప్‌ను పునరుద్ధరించింది. ఇందులో ఏఐ ఇప్పుడు టెక్ట్స్ సమాధానాలు ఇవ్వడంతో పాటు వెబ్సైట్లాంటి ఇంటర్ఫేస్లో డిస్ప్లే విజువల్, ఇంటరాక్టివ్ ఎలిమింట్స్‌ను ప్రదర్శిస్తుంది. బిజినెస్ యూజర్ల కోసం ‘యాంటీగ్రావిటీ’ ప్లాట్‌ఫామ్ ని అభివృద్ధి చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఏఐ ఏజెంట్లకు వారి సొంత కోడ్‌ను ప్లాన్ చేసుకునే, రాసి ఇచ్చేసామర్థ్యాన్ని ఇస్తుంది. జెమిని 3 డెవలపర్ల కోసం అనేక కొత్త కోడింగ్ ఫీచర్స్‌ను సైతం జోడిస్తుంది.